Telugu Flash News

Health Tips : భోజనం తినేటప్పుడు నీరు తాగుతున్నారా? చాలా డేంజర్‌.. వెంటనే మానుకోండి!

drinking water

Health Tips : రోజంతా నీరు తాగేందుకు సమయం కుదరదు గానీ.. చాలా మందికి భోజనం తినేటప్పుడే చాలా దాహం వేస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు తినగానే ఓ గ్లాసు నీళ్లు తాగేస్తుంటారు. ఇలా మొదలు పెట్టి భోజనం పూర్తయ్యే సరికి సుమారు లీటర్‌ నీరు తాగేస్తుంటారు. మనలో చాలా మందికి ఇలాంటి అలవాటే ఉంటుంది. అయితే, ఈ విధానం చాలా డేంజర్‌ అని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం తినే సమయంలో ఎందుకు నీరు తాగరాదో తెలుసుకోవాలి.

సాధారణంగా రోజూ కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, చాలా మంది భోజనం తినేటప్పుడు మాత్రమే ఎక్కువగా నీరు తాగుతుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపులో యాసిడ్స్‌ ఫాం అవుతాయి. మనం ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు కేవలం ఆహారం మాత్రమే తీసుకోవాలి. వాటితోపాటు నీటిని తీసుకోరాదు. భోజనం, ఫ్రూట్స్‌ తీసుకునే సమయంలో నీటిని అవాయిడ్‌ చేయాలి.

అలా కాకుండా భోజనం తినేటప్పుడు నీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అరిగిపోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. కేవలం ఆహారం మాత్రమే తీసుకోవడం వల్ల కడుపులో అవి అరిగిపోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి నీరు చాలా కీలకం. అయితే, ఆహారంతోపాటు తీసుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు. నీరు మనం తినే ఆహారంలోని సంక్లిష్ట భాగాలను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరం సులభంగా గ్రహించేటట్లు చేస్తుంది.

భోజనం తిన్న గంట తర్వాత నీరు తీసుకోవాలి

భోజనం తినడానికి గంట ముందు, లేదా భోజనం తిన్న గంట తర్వాత నీటిని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సమయం ఇచ్చినట్లవుతుంది. శరీరం సులభంగా నీటిని గ్రహిస్తుంది. ఫలితంగా ఆహారం నుంచి పోషకాలు సమగ్రంగా శరీరానికి అందుతాయి. చిన్న పేగులు, పెద్ద పేగుల్లోకి నీరు సులభంగా చేరుతుంది. సంక్లిష్టంగా మారిన పోషకాలను ఈజీగా అరిగించేందుకు దోహదం చేస్తుంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version