Telugu Flash News, Health Tips : అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని తాగడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
చర్మానికి ప్రయోజనాలు
గంజిలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
గంజిని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను నివారించవచ్చు.
జుట్టుకు ప్రయోజనాలు
గంజిలో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలను పెంచడంతో పాటు జుట్టు చిట్లిపోకుండా చేస్తాయి.
గంజిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
పీరియడ్స్ నొప్పి నివారణ
నెలసరిలో చాలామంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు రోజూ ఓ గ్లాసు గంజి తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.