Health Tips :
- ప్రయాణాలలో కాసిన్ని లవంగాలను నములుతుంటే కడుపులో వికారం తగ్గుతుంది.
- కొత్తిమీర, కరివేపాకులో నిమ్మరసం వేసి మెత్తని పేస్ట రుబ్బి మజ్జిగలో కలిపి తాగితే శరీరం ఎండవేడిమికి అనుగుణంగా ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకుంటుంది. చిన్న పిల్లలకు, వయసు పైబడిన వాళ్ళకు ఇది చక్కటి ఉపశమనం.
- పిల్లలలో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి.
- ఆస్మాతో బాధపడేవారు ఉప్పునీటి పాత్రను దగ్గరగా ఉంచుకొని పీలుస్తుంటే ఆ లక్షణాలు దూరమవుతాయి. సైనస్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు మామూలు ఉప్పుకు బదులుగా బేకింగ్ సోడా కలుపుకోవాలి.
- శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టమోటారసం కలిపి అరగంట తర్వాత స్నానం చేయాలి. * పళ్ళు పసుపుగా గారపట్టినట్లు ఉంటే బ్రష్ చేయడం పూర్తయ్యాక ఉప్పునీటిలో పుక్కిలించాలి.
- చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటే ప్రతిరోజూ బ్రష్ చేసుకున్న తరువాత గోరువెచ్చని నీటిలో పటిక కలిపి పుక్కిలించాలి.
- జలుబు ఎక్కువై గాలి పీల్చుతున్నప్పుడు ఛాతీలోనుండి శబ్దం వస్తున్నట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకలను చిదిమి వేసుకొని తాగాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
- తలనొప్పికి, కీటకాలు కుట్టినచోట గాయం వలన కలిగే నొప్పికి ఆముదం రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది.
- రోజుకొక ఆపిల్ తీసుకొని ఆరోగ్యవంతులవ్వండి. దీనిలో ఉండే ప్రోటీన్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని కూడా పెంచుతాయి.
- ఏప్రికాట్ తీసుకుంటే క్యాన్సర్ కణాల ఉత్పత్తిని అదుపు చేసి, రక్తపోటును నియంత్రించటమే కాకుండా కంటి చూపును కూడా బాగుచేస్తాయి.
also read :
moral stories in telugu : ఇద్దరు అన్నదమ్ముల కథ
Horoscope (14-03-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
beauty tips : రూపాయి ఖర్చు లేకుండా అందమైన ముఖం మీ సొంతం.. చిట్కాలివే..