Telugu Flash News

Health Benifits of Lady Finger : బెండ‌కాయ‌ల‌ని ఔష‌ద‌ప‌రంగా కూడా ఉప‌యోగిస్తారనే విష‌యం మీకు తెలుసా?

health benefits of lady finger

Health Benifits of Lady Finger: మ‌న ఇంటి పెర‌ట్లో పెరిగే కూర‌గాయ‌ల‌లో బెండ‌కాయ కూడా ఒక‌టి. ఇది రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాక వ్యాదుల ప్ర‌మాదం కూడా త‌గ్గిస్తుంది. బెండకాయలు మీకు ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఇక ముందు తినకుండా ఉండలేరు. ఇవి మీ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయ‌డ‌మే కాకుండా మీ గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయి. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా త‌గ్గిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్లు క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది.

చాలా ఉప‌యోగాలు..

బెండ‌కాయ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా పెక్టిన్ అనే మూలకం ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది .గుండెపోటు ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. డ‌యాబెటిక్ రోగులకు బెండకాయలు తినడం చాలా మంచిది. ఇతర కూరగాయల కంటే బెండలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 100 గ్రా. బెండకాయలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మొత్తం విటమిన్ సీలో 38 శాతం దొరుకుతుంది.

బెండ‌కాయ లో కేలరీలు లేకపోవడం వల్ల బరువు పెరగరు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బెండ‌కాయ తింటే బెట‌ర్. బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని సామెత ఉంది. బెండకాయ షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా బాగా పనిచేయ‌డ‌మే కాక‌, రక్తంలో చక్కెర వ్యాధి తగ్గించి షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.. బెండకాయలో మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట పోగొట్టి కడుపులో ఉపశమనం కూడా క‌లిగిస్తుంది. అందుకే వీలైనంత వ‌ర‌కు మీ మెనూలో బెండ‌కాయ త‌ప్ప‌క చేర్చుకోండి.

Exit mobile version