Telugu Flash News

Banana: అర‌టిపండుతో ఆరోగ్యంతో పాటు దుష్ప్ర‌భావం కూడా క‌లిగిస్తుంద‌నే విష‌యం మీకు తెలుసా?

banana health benefits

Banana: మ‌న‌కు విరివిగా దొరికే ఫ్రూట్స్ లో అర‌టి పండు ఒక‌టి. దీనిని ఎవ‌రైన చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు అర‌టిపండ్ల‌పై మ‌క్కువ ఎక్కువ చూపిస్తుంటారు. చవకగా లభించే అరటి పండ్లతో లాభాలు ఎన్నోఉన్నాయి. అలా అని ఎక్కువ త‌క్కువ తిన్నా కూడా కొన్ని దుష్ప్ర‌భ‌వాలు క‌లిగే అవ‌కాశం ఉంది.

అర‌టిపండులో చాలా ర‌కాల ప్రొటీన్స్ ఉన్నాయి. వంద గ్రాముల బరువుండే అరటి పండులో 0 శాతం కొవ్వు, 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ బీ6, మాంగనీస్, రాగి, బయోటిన్ పుష్క‌లంగా ఉంటాయి. అయితే, బాగా పండిన అరటి పండులోని పోషకాలు సాధారణ అరటి పండులో అంత‌గా ఉండ‌వ‌ని నిపుణుల మాట‌.

బ‌హు ప్ర‌యోజ‌నాలు

మనం స‌న్న‌గా ఉంటే అరటిపండు తినేయండి. దీంతో లావు అయిపోతారు. స‌న్న‌గా ఉన్న వారు అరటిపండును అల్పాహారంలో చేర్చుకోండి. అయితే బరువు పెరగడానికి రాత్రిపూట కూడా అరటిపండు తింటారు. కానీ అది మీ శరీరానికి దుష్ప్ర‌భావం కలిగిస్తుంది.

అర‌టి పండుని అల్పాహారంలో తినడానికి ప్రయత్నించండి. అల్పాహారంలో అరటిపండును అనేక రకాలుగా తినవచ్చు. పాలు, అరటిపండు, ఇంకా బనానా షేక్ రూపంలో తీసుకుంటే మీకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. అరటి పండ్లు తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయే తప్ప.. ఎక్కువ కావని అంటున్నారు.

అరటి పండు తినడం వలన మంచే జరుగుతుందని, ఇందులో ఉండే యాంటాసిడ్ వల్ల అజీర్తి సమస్యలు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అర‌టిపండుని తిన్న తర్వాత వెంటనే కాకుండా నిద్రపోయే రెండు, మూడు గంటల ముందు తింటే బాగుంటుంది.

శరీరం షేప్‌గా ఉండాలంటే మధ్యాహ్న భోజనంలో పెరుగు, అరటిపండు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల‌న మీ జీవక్రియ రేటును పెంచుతుంది. ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌య్యేలా కూడా చేస్తుంది. పెరుగు-అరటిపండుతో జ్యూస్ లాగా చేసుకోని కొంచెం దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి కలపి తాగితే చ‌క్క‌ని ఉప‌యోగం ఉంటుంది.

ఇవి కూడా చదవండి 

ginger health benefits : అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Exit mobile version