Telugu Flash News

Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్

Dry Fruits Health Benefits : ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్ లో ఉన్నాయి. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తినమని పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నారు. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కాదు… గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం. కనుక శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి ఈ డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ఒక మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు.

జీడిపప్పు (cashew nuts):

గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో నుంచి లభిస్తాయి, కాబట్టి ప్రతిరోజు ఏ పనిలో ఉన్నా ఓ ఐదు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.

బాదం (almonds) :

బాదం పప్పులో మెగ్నీషియం, పోటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజు బాదం పప్పులు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. గర్భవతులు రోజు ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలేట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి.

వాల్ నట్స్ (walnuts):

ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.

ఎండుద్రాక్ష (raisins) :

చూడటానికి ఎంతో చిన్నగా ఉండే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఎక్కువ. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజు తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఖర్జూర పండ్లు (dates fruits) :

ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ప్రక్టోజ్లు వీటిలో ఉంటాయి. చిన్న ప్రేవుల్లో చోటు చేసుకొనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది. ఇందులో మంచి పోషకాహార విలువలు ఉంటాయి.

అంజీర పండు (anjeer dry fruits) :

ఎండిన అంజీర పండులో పీచు, రాగి, మంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్-కె వంటివి పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం పీచు రూపంలో కలిగిఉండేది అంజీర పండులో మాత్రమే. అయితే ఏదైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే. కనుక తగు పరిమాణంలో నిత్యం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Pawan Kalyan: ఇది క‌దా ప‌వన్ మేనియా.. రీరిలీజ్‌ని కూడా ఇంత‌గా ఆద‌రిస్తారా…!

Chris Gayle: కుంబ్లేపై క్రిస్ గేల్ సంచ‌ల‌న కామెంట్స్… ఆయ‌న వ‌ల్ల‌నే నేను ఇలా….!

Exit mobile version