ఇంగువగా ప్రసిద్ధి చెందిన ఆసఫోటిడాకు భారతీయ వంటకాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి వండినప్పుడు ఘాటైన ఇంగువ వాసన వంటకాలకు తనదైన రుచిని కలిగిస్తుంది. దీనిని సాంబార్ వంటి రుచికరమైన శాకాహార వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపునకు, పచ్చళ లోనూ ఇది సాధారణ దినుసు. కాని ఈ మూలికకు ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి.
ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించటంతోపాటు, నొప్పి నివారిణిగా, విరేచనకారిగా, నరాల ఉత్తేజక మందుగా పనిచేస్తూ కఫం లాంటి ఇబ్బందుల నుండి ఇంగువ ఉపశమనం కలిగిస్తుంది.
ఇంగువలోని ఆరోగ్య ప్రయోజనాలు :
ఇంగువను పురాతన కాలం నుండి అజీర్తికి ఇంటి వైద్యంగా ఉపయోగిస్తున్నారు. క్రమక్రమంగా దీనిని వంటకాలలో భాగంగా నిత్యం ఉపయోగిస్తున్నారు. దీనిలో కడుపు మంటను తగ్గించే గుణం, యాంటి ఆక్సి డెంట్ లక్షణాలు, చికాకు పెట్టే కడుపు నొప్పి, పేగులో వాయువు, పేగు వ్యాధి (ఐ బి ఎస్) మొదలైన అజీర్తి. వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్క లను కరిగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
రుతుక్రమ సమస్య నివారిణి:
స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తమ్మిది, సక్రమంగా లేని రుతువుకు, బాధతో గ్రామాల వంటి వాటికి ఇంగువ ఈ ఔషధ మూలికను అంటు యోని నుండి వచ్చే చిక్కటి తెల్లని స్రావం) వంటి వ్యాధులను తగ్గిం చడానికి కూడా వాడతారు.
శ్వాస సంబంధిత వ్యాధులు:
శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి శ్వాసను ఉత్తేజపరిచే మందుగా, కఫం తగ్గించటానికి, ఛాతీలోని ఒత్తిడి తగ్గించటానికి పనిచేస్తుంది. తేనే, అల్లంతో కూడిన ఇంగువను దీర్ఘకాలంగా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడతారు.
డయాబెటిస్ :
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే దానికి కాకర కాయను ఇంగువతో కలిపి తీసుకుంటే మంచిది.
అధిక రక్తపోటు:
ఈ ఔషధ మూలికలో ఉన్న కొమరిన్లు రక్తాన్ని పలుచన చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. అధిక ట్రైగిజరైడ్స్, కొలెస్ట్రాలకు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటు, లో బీపీలను నియంత్రిస్తుంది.
నరాల లోపాలు:
ఆహారంలో వాడే ఈ రుచికరమైన పదార్ధం నరా లను ఉత్తేజితం చేస్తుంది. అందువలన ఇది మూర్ఛ, వంకరలు పోవటం, సొమ్మసిల్లడం, నాడీ సంబంధిత వ్యాధులలో దీనిని బాగా ఉపయోగిస్తారు,
నొప్పి:
నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రేయిన్ తలనొప్పిని తగ్గిస్తుంది. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఉపయోగిస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ గల ఇంగువ, శరీర కణాలను క్యాన్సర్ నుండి కాపాడుతుంది. అధ్య యనాల ప్రకారం, ఇంగువ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
చర్మ వ్యాధులు:
అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడ తారు. దీనిని పుండ్లు, ఆనెలు ఉన్న చర్మంపై కూడా నేరుగా పూయవచ్చు.
రోగనిరోధక శక్తి:
ఇంగువలో రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ మంచి మందు. కాసిన్ని నీటిలో ఇంగువను వేసి ఆ నీటిని చర్మంపై పూస్తే ఉపశమనం లభిస్తుంది.
దంతాల ఆరోగ్యానికి :
పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములు మటు మాయం.
మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకునేముందు ఇంగువ చూర్ణం తీసు కుంటే ఫలితం ఉంటుంది.
మరిన్ని చదవండి :
Inaya: ఎట్టకేలకు తన కోరిక నెరవేర్చుకున్న ఇనయ.. ఫైనల్‌కి ఒక్క అడుగు దూరంలోనే…!