Telugu Flash News

cashew nuts :జీడిపప్పులో ఉన్న పోష‌కాలు తెలిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు..!

Cashew Nuts

cashew nuts :డ్రై ఫ్రూట్స్‌లో ఒక‌టైన జీడిపప్పుని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జీడిప‌ప్పును ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినియోగిస్తుంటారు.ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పు కూరల్లో, స్వీట్స్‌ల‌లో కూడా త‌ప్పని స‌రిగా వాడుతుంటారు. ధర కాస్త ఎక్కువైనప్పటికీ జీడిపప్పును ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ఉప‌యోగించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబ‌ట్టి వాటిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది

జీడిపప్పును రోజూ తినడం వల్ల మ‌న‌ శరీరంలో ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం లోపాలను అధిగమించ‌వచ్చు .

అయితే జీడిప‌ప్పుని నేరుగా తిన‌కూడదు అంటారు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నాన‌బెట్టి, మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు వీటిని తింటే మంచిది.

ఇలా తిన‌డం వ‌ల‌న అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీడిపప్పు తినడం వల్ల ముడతల సమస్య తొలగిపోతుంది. విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు జీడిపప్పులో ఎక్కువగా ఉన్నాయి.

జీడిపప్పులో ఫైబర్ ఎక్కువ‌గా ఉంటుంది. దీని వ‌ల‌న జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య, మలబద్ధకం కూడా తొల‌గిపోతాయి.

ఎముకలు, మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి, మెగ్నీషియం, యాంటిఆక్సిడెంట్లు లాంటివి కూడా జీడిప‌ప్పులో ఎక్కువ‌గానే ఉంటాయి.

ఇందులో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ లాంటివి ఉండ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలో యాంటీ ఆక్సిడెంట్లను కూడా పెంచుతుంది. తద్వారా జీవిత కాలం కూడా పెరుగుతుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

జీడిపప్పులో జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్క‌లంగా ఉండ‌డంతో వీటిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. రోజూ జీడిపప్పు తినడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా మారుడంతోపాటు మెరుస్తుంది.

Exit mobile version