Health Tips | ఆరోగ్య చిట్కాలు
- రోజూ పరగడుపున ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే మార్నింగ్ సిక్నెస్ నుంచి సులభంగా బయటపడవచ్చు.
- ఫ్రూట్ జ్యూస్లలో చక్కెరకు బదులు తేనె వాడితే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శక్తి వస్తుంది.
- సాయంత్రం తీసుకునే టీ లో ఒక టీ స్పూన్ తేనె కలుపు కుంటే నిద్ర బాగా పడుతుంది.
- పంచదార బదులు తేనె వాడితే గుండె సంబంధిత వ్యాధుల వారికి చక్కటి మందులా తేనె పనిచేస్తుంది.
- శొంఠి, నువ్వులు, బెల్లం … ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని ఉండ చేసి రోజూ రెండు పూటలా పాలతో పాటు తీసుకుంటే కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
- ఒకటి, రెండు తులసి దళాలు ప్రతిరోజూ క్రమం తప్ప కుండా తింటే కఫం, వాతం దరిచేరవు.
- ముక్కు పట్టేసి గాలి పీల్చటానికి ఇబ్బంది అయితే ఒక లీటరు నీటిని మరిగించి చిటికెడు పసుపు వేసి ఆవిరిపడితే జలుబు భారం తగ్గి హాయిగా ఉంటుంది.
- కాఫీ ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీనివల్ల పెదవులు పొడిబారుతాయి కూడా.
- ఆరెంజ్ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి సున్నిపిండిలో కలిపి స్నానానికి ముందు శరీరానికి రాసి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా మారి కొత్త మెరుపు సంతరించు కుంటుంది.
- రోజువారీ ఆహారంలో కాప్సికమ్ చేరిస్తే మధుమేహం, గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఔషధంగా మారి నియంత్రిస్తుంది.
Also Read :
Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి
Eiffel Tower : ఈఫిల్ టవర్ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి
Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
moral stories in telugu : మాట తప్పని ఆవు.. కథ చదవండి
-Advertisement-