HomecinemaOscars 2023 : దేశం గ‌ర్వించేలా చేసిన డాక్యుమెంటరీ.. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌‌కు ద‌క్కిన‌ ఆస్కార్

Oscars 2023 : దేశం గ‌ర్వించేలా చేసిన డాక్యుమెంటరీ.. ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌‌కు ద‌క్కిన‌ ఆస్కార్

Telugu Flash News

Oscars 2023 : ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ వేడుక‌లు ఎంత అట్ట‌హాసంగా మొద‌లయ్యాయి. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జ‌రుగుతుండ‌గా,ఈ కార్య‌క్రమానికి ఎంతో మంది అతిర‌థ‌మ‌హార‌ధులు హాజ‌ర‌య్యారు. అయితే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో మ‌న‌ ఇండియాకు ఆస్కార్ వచ్చింది. ‘హౌలౌట్’, ‘హౌ డు యు మెసర్ ఎ ఇయర్’, ‘ది మార్టా మిచెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం పోటీ పడ‌గా, ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఆస్కార్ అవార్డు గెలుచుకుని… దేశం మీసం మెలేసింది.

నెట్​ఫ్లిక్స్ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించ‌గా, ఆస్కార్‌ వేదిక మీద చీరకట్టుతో మన వనితలు అవార్డు అందుకోవ‌డం చూసి ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నారు. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీని రూపొందించ‌గా, కార్తికీ గాన్‌స్లేవ్స్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వహించారు. గునీత్‌ మోంగా నిర్మించారు. కుట్టునాయకన్‌ అనే గిరిజన ఫ్యామిలీలో కలిసి పెరిగిన ఏనుగు కథ నేప‌థ్యంలో ఈ డాక్యుమెంట‌రీ రూపొంద‌గ‌గా, ఐదేళ్ల పాటు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సాగింది. ఎట్ట‌కేల‌కు ఈ డాక్యుమెంట‌రీ ఆస్కార్ అవార్డ్ ద‌క్కించుకోవ‌డంతో ప్ర‌తి ఒక్క భారతీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడు.

also read :

oscar award for naatu naatu : నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్.. దేశం మీసం మెలేసిన ఆర్ఆర్ఆర్..

Naatu Naatu at Oscars 2023 : ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు ప్ర‌ద‌ర్శ‌న‌.. వీడియో

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News