Telugu Flash News

HDFC BANK : ఎక్కువ వడ్డీతో కొత్త ఎఫ్ డీ స్కీమ్ లు

hdfc bank

hdfc bank

HDFC BANK : చాలా మంది సామాన్య ప్రజలు తమ సేవింగ్స్ ను డిపాజిట్ చేసేందుకు బ్యాంకులకే వెళ్తుంటారు. ఎందుకంటే ఇది చాలా మందికి మొదటి నుంచి తెలిసిన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీమ్. ప్రజలకి బ్యాంకులపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ స్కీమ్ తో పాటు ఒక్కొక్క డిపాజిటర్ కు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంది. బ్యాంకులు విఫలమైనా ఒక్కో బ్యాంకులో ఒక్కో డిపాజిటర్ కు రూ.5 లక్షలు అందజేస్తారు.

మరియు బ్యాంక్ FD చాలా మంది ఆదాయంగా చూస్తారు. చాలా మంది మంచి రేటుకు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటించిన తాజా డిపాజిట్ పథకాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ రెండు రకాల ప్రత్యేక డిపాజిట్ పథకాలను తీసుకొచ్చింది. ఇది 35 నెలల డిపాజిట్‌పై 7.20 శాతం రేటును అందిస్తోంది. 55 నెలల డిపాజిట్‌పై 7.25 శాతం రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు నిండిన వారికి) మరో అర శాతం ఎక్కువ రేటు ఇస్తారు.

read more news :

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (29-05-2023)

Exit mobile version