తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ కేడర్‌కు కేటాయింపు జరిగిన సోమేష్ కుమార్.. అనంతరం క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాడర్ కేటాయింపు వివాదం అప్పటి నుంచి కొనసాగుతోంది. అయితే, దీనిపై తాజాగా ధర్మాసనం సంచలన నిర్ణయం వెలువరించింది.
గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది.. తీర్పు అమలుకు, అప్పీలుకు వెళ్లేందుకు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరారు. మూడు వారాల పాటు సమయం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. తమ తీర్పును అమలు చేయాలని సూచించింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, దీనిపై క్యాట్‌ను ఆశ్రయించిన సోమేష్ కుమార్.. తెలంగాణలో కొనసాగేలా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎస్‌గా పని చేస్తున్నారు సోమేష్ కుమార్. అయితే, క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలని కేంద్రం 2017లోనే హైకోర్టును కోరింది.
రాజకీయ అస్త్రంగా మారిందా?
చాలా సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ వ్యవహారంపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ.. సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోయవాలని ఆదేశించింది. అనంతరం సీఎస్ సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తదుపరి కార్యాచరణ ఎలా చేయాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి దీనిపై వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమేష్ కుమార్ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
also read:
Amaravati : ఏపీ రాజధానిపై సుప్రీం కోర్టులో కీలక పరిణామం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం ఏమందంటే..!