Telugu Flash News

Harish Shankar: సురేష్ కొండేటి కి దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్.. అస‌లేమైందంటే..!

harish shankar

Harish Shankar: గ‌బ్బ‌ర్ సింగ్‌తో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల మూవీ గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్కి పూన‌కాలు తెప్పించింది.ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు హ‌రీష్ శంక‌ర్. తాజాగా ఈ ద‌ర్శ‌కుడికి ఓ జ‌ర్న‌లిస్ట్ నుండి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. దీంతో హ‌రీష్ శంక‌ర్ కూల్ వార్నింగ్ ఇచ్చాడు. సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి ఇటీవ‌లి కాలంలో సంబంధం లేకుండా ప్ర‌శ్న‌లు సంధిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. గతంలో ‘డీజే టిల్లు’ మూవీ నుంచి రీసెంట్‌గా ‘విరూపాక్ష’ సహా నిన్న మొన్నటి నిఖిల్ ‘స్పై’ వరకు అన్ని ప్రెస్ మీట్లలోనూ విచిత్ర‌మైన ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ చీవాట్లు తింటున్నాడు. అయిన‌ప్ప‌టికీ కూడా త‌గ్గేదే లే అంటూ పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తున్నాడు.

తాజాగా టొవినో థామస్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘2018’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మెగా నిర్మాత బ‌న్నీ వాసు. ఈ క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సురేష్ కొండేటి వేసిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ శంక‌ర్ దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చాడు.

ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయగలడా? తెలుగు నిర్మాతలు ఇంత సాహసం చేయగలరా? అంటూనే ఓ నిర్మాతగా మీకు ఏ ఫీలింగ్ కలిగింది? అని నిర్మాత బన్నీ వాసుని విచిత్ర‌మైన ప్ర‌శ్న వేసాడు సురేష్ కొండేటి. అప్పుడు ఆ ప్ర‌శ్న‌కు హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ‘నేను ఈ మధ్యన యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా. అందులో సురేష్ కొండేటి గారు ప్రతి ప్రెస్ మీట్‌లో విచిత్ర ప్ర‌శ్న‌లు వేసి మొత్తం తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి, దాన్ని యూట్యూబ్‌లో వైరల్ చేసేసుకుని ట్రెండ్ సెట్ చేస్తుండ‌డం గ‌మ‌నిస్తున్నాను.

ఇక్క‌డ ఓ సామెత ఉంది. వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంటా అని దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు. అయిన కూడా సురేష్ త‌న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలని హ‌రీష్ ని అడిగాడు. దానికి స్పందిస్తూ.. ప్రపంచ సినిమా ఇప్పుడు టెక్నాలజీ ఎరాలో ఉంది. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ గురించే మాట్లాడుకుందాం.. డబ్బింగ్ సినిమా అంటే.. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్‌ను హిందీలో ఎవరైనా డబ్బింగ్ సినిమా అని భావించారా? ఇక్కడ డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమా అనేది ఏమి లేదు. ఒక సినిమా అంతే. ఏ సినిమా ఎంత దూర‌మైన‌ వెళ్తుంది. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా? అంటే ఇపుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలు చూస్తున్న రోజుల్లో నువ్వు ఇలాంటి క్వశ్చన్ వేశావంటే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సురేష్’ అని విలేక‌రికి దిమ్మ‌తిరిగే పంచ్ విసిరాడు హ‌రీష్ శంక‌ర్.

Exit mobile version