Telugu Flash News

Harbhajan singh: భ‌జ్జీకి కోప‌మొచ్చింది.. అక్ర‌మాలు చూస్తే అస్స‌లు ఊరుకోమంటూ వార్నింగ్

Harbhajan singh: టీమిండియా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఏ విష‌యంపై నైన చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటాడు. త‌ప్పొప్పుల గురించి మాట్లాడుతూ వాటిని ఖండిస్తూ ఉంటారు. అయితే బీసీసీఐ రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని హర్భజన్ సింగ్ దారుణ‌మైన కామెంట్స్ చేసాడు.

అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే వదిలేది లేదంటూ హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశాడు.. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం ఎంపీ (రాజ్య సభ)గా కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు..

అయితే తాజాగా హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.. పీసీఏకు బహిరంగ లేఖ రాస్తూ.. ‘‘పంజాబ్‌లో‌ని క్రికెట్ లవర్స్ నుంచి నాకు గత 7-10 రోజులుగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ అవినీతికి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఇది క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ స్ఫూర్తి‌కి పూర్తి విరుద్ధం అని ఆయ‌న మండిప‌డ్డారు.

పంజాబ్ క్రికెట్ అసోషియేషన్‌ అంబుడ్స్‌మెన్‌కి కూడా నేను ఫిర్యాదు చేశాను’’ అని భ‌జ్జీ త‌న ఫిర్యాదులో స్ప‌ష్టం చేశారు. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని హ‌ర్భ‌జ‌న్ ఆరోప‌ణ‌లు చేశాడు.

పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

కొంద‌రు వారి వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..’అని భ‌జ్జీ పేర్కొన్నాడు. కాగా, మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు.

హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఇలా సింగ్‌పై భ‌జ్జీ ఆరోప‌ణలు చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Exit mobile version