HomehealthHappy Hypoxia: పైకి లక్షణాలు కనిపించవు.. కానీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయ్

Happy Hypoxia: పైకి లక్షణాలు కనిపించవు.. కానీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయ్

Telugu Flash News

Happy Hypoxia : చాలామంది ప్రాణాలను బలిగొన్న COVID-19 మహమ్మారిని మనలో ఎవరూ మరచిపోలేరు.  మనం క్షేమంగా ఉన్నామని భావించినప్పుడు కూడా.. రోజుకు మూడుసార్లు మన ఆక్సిజన్ లెవెల్స్ ను కొలవమని అప్పట్లో వైద్యులు సూచనలు చేశారు.

మీ రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ స్థితిని హైపోక్సేమియా అంటారు. ఇది తలెత్తితే మీ ఊపిరితిత్తులలో సమస్య వస్తుంది. ఈ స్థితిలో మీ అవయవాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభించకపోవచ్చు. ఇటువంటప్పుడు తక్షణ వైద్య సహాయం అవసరం. ఎందుకంటే ఇది అవయవ నష్టం మరియు మరణానికి కూడా దారితీయవచ్చు.

పల్స్ ఆక్సిమీటర్ స్థాయిలు..

హైపోక్సేమియాను ఎదుర్కొనే వారిలో  పల్స్ ఆక్సిమీటర్ ను ఉపయోగించి ఆక్సిజన్ స్థాయిలను కొలిచేటప్పుడు.. సాధారణ విలువలు 95 మరియు 100 శాతం మధ్య ఉంటాయి. స్థాయి 92 లేదా 90 దాటితే.. అప్పుడు వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది.

చాలా సందర్భాలలో శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన రేటు, వేగవంతమైన శ్వాస వంటి అనేక స్పష్టమైన కారణాలలో హైపోక్సియా వ్యక్తమవుతుంది.

చాలా సందర్భాలలో రోగులకు తమ ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలియదు. ఈ పరిస్థితినే హ్యాపీ  హైపోక్సియా అని పిలుస్తారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువకుల కోవిడ్ మరణాల వెనుక చాలా మందిలో ఇది ఒక ప్రధాన కారణమై ఉండొచ్చు.

COVID సమయంలో చాలా మంది వైద్యులు హైపోక్సియా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో చూసి ఆశ్చర్యపోయారు. తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ తో ఆక్టివ్ గా ఉన్న అనేక మంది COVID-19- ప్రభావిత రోగులను చూసిన వైద్యులకు ఈ పరిస్థితి చాలా గందరగోళంగా అనిపించింది.

-Advertisement-

యువకులు తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ను చాలా కాలం పాటు ఇబ్బంది లేకుండా తట్టుకోగలరని నిపుణులు నమ్ముతారు. కొన్ని నివేదికల ప్రకారం, తీవ్రమైన హైపోక్సియాతో అత్యవసర విభాగాల్లో చేరిన కొంతమంది రోగులకు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంతమంది రోగులలో ఆక్సిజన్ స్థాయిలు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

also read news:

England vs Pakistan 1st Test : టెస్టులో టీ20 లా ఆడిన ఆటగాళ్లు..!

ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఏమవుతుందో తెలుసా ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News