ఈరోజు అక్టోబర్ 23న ప్రభాస్ (prabhas) తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారి దంపతులకు 23 October 1979 న జన్మించాడు. భీమవరంలోని డీఎన్ఆర్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ చదివాడు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుని తనయుడు ప్రభాస్ కాగా, ఆయన ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.
ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియాస్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. బాహుబలికి ముందు ఆయన రెమ్యునరేషన్ 7 కోట్లు. ప్రస్తుతం 150 కోట్లు పైనే. సందీప్ రెడ్డి వంగా సినిమా కోసం ప్రభాస్ 150 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. వాలీబాల్ అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. ఇంట్లోనే ఏకంగా కోర్ట్‌ని నిర్మించుకున్నాడట.
మైనపు విగ్రహం
ఖాళీగా ఉన్నప్పుడు వాలీ బాల్ ఆడి తన ఫిట్ నెస్ పెంచుకుంటాడు. ప్రభాస్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని రూపొందించగా, ఈ ఘనత పొందిన తొలి దక్షిణ భారత నటుడుగా నిలిచాడు డార్లింగ్.. సినిమా రంగంలోకి రాకముందు శేఖర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ అభ్యసించాడు.
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు 100 కిలోల బరువు పెరగేందుకు చాలా కష్టపడ్డాడు.. లక్ష్మణ్ రెడ్డి ఈ చిత్రం కోసం అతనికి శిక్షణ ఇచ్చాడు. జీక్యూ మ్యాగజైన్ 2017లో అత్యంత ప్రభావవంతమైన యువకుల జాబితాలో ప్రభాస్ ఆరవ స్థానంలో నిలిచాడు.
ప్రభాస్ ఫేవరెట్ మూవీస్
ఇక బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు నాలుగేళ్ల సమయం కేటాయించాడు. ఆ సినిమా కోసం ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. ఈ సినిమా 100 సినిమాలతో సమానం అని ప్రభాస్ సింపుల్ గా చెప్పేశాడు. 1976లో విడుదలైన భక్త కన్నప్ప చిత్రం అతని ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. రాజ్‌కుమార్ హిరానీ సినిమాలను ఎక్కువగా చూస్తుంటాడు. మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్‌ని దాదాపు 20 సార్లు చూసాడని వినికిడి.
ఇక, దేనికైనా రెడీ (2012)లో మంచు విష్ణుకి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక 2014లో వచ్చిన అజయ్ దేవగన్ చిత్రం యాక్షన్ జాక్సన్‌లో అతిధి పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఇదే ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ.
ప్రభాస్ ఇష్టమైన వంటకాలు
నటుడు కాకపోతే, ప్రభాస్ హోటళ్ల వ్యాపారి కావాలని అనుకున్నాడట. ప్రభాస్‌కి భుజించడమే కాదు, వడ్డించడం ఇష్టం. ఆయన భోజన ప్రియుడు. అతనికి ఇష్టమైన వంటకాలు బటర్ చికెన్ మరియు బిర్యానీ. బాహుబలి కోసం ఫిజికల్ ప్రిపరేషన్‌లో అతను నాన్ వెజ్ ఎక్కువగా తిన్నాడు.
షూటింగ్‌లో బిజీగా లేనప్పుడు ప్రభాస్ పుస్తకాలు ఎక్కువగా చదువుతాడట. అతని ఇంట్లో పెద్ద లైబ్రరీ కూడా ఉందట. ప్రభాస్‌కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం . అతను లండన్ వెళ్లడానికి ఇష్టపడతాడు మరియు యూరప్ పర్యటనలను ఇష్టపడతాడు.
ప్రేమ, పెళ్లి పై పుకార్లు
ప్రభాస్ , అనుష్క శెట్టి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని ఎన్నో పుకార్లు వచ్చాయి. బాహుబలి సమయంలో తనకు 6000 పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయని, వాటన్నింటినీ తిరస్కరించాడని ఒకరు పేర్కొన్నారు. అతను 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థితో నిశ్చితార్థం చేసుకున్నాడని, కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు కృతి సనన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రభాస్ కి ఉదార స్వభావం ఎక్కువ. విరాళాలు కూడా అందిస్తుంటాడు. వాణిజ్య ప్రకటనలపై పెద్దగా ఆసక్తి చూపడు. అతను 150 కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను తిరస్కరించినట్టు టాక్. ఇప్పుడు ప్రభాస్ తన సినిమాలో కథ బాగుండేలా చూసుకుంటున్నాడు.
వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ సినిమాలో ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు, ఏది మంచి ఏది చెడు అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మన ఆలోచనలు చాలా ప్రభావితంగా ఉండాలనిఆయన అన్నారు. సినిమాలలో అద్భుతంగా నటించే ప్రభాస్.. బహిరంగ సభలలో పెద్దగా మాట్లాడలేడు.
ప్రభాస్ ఇంట విషాదం
ఇటీవల ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందడంతో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడు.
అయితే ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుండి బయటకు వస్తున్న ప్రభాస్, అక్టోబర్ 23న పుట్టినరోజును జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎలాంటి బర్త్‌డే వేడుకల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నాడట. తన పెద్దనాన్నకు సంతాపం తెలిపే క్రమంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడట.