Hanuman: బాహుబలి తర్వాత టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో పలు చిత్రాలు కూడా రూపొందుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక త్వరలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్షకులని పలకరించనుంది. అయితే ఈ సినిమా కన్నా కూడా చాలా మంది హనుమాన్ అనే సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకు కారణం ఆ మధ్య చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్. ఈ టీజర్ ఆదిపురుష్‌ని మించి ఉందని కొందరు తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. చిన్న వయసులోనే కేవలం 4 సినిమాలు తీసి తెగ ఫేమస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ను అనుసరించే హనుమాన్ తీశారని కొందరు చెబుతున్న క్రమంలో ప్రశాంత్ వర్మ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అలానే తాను తెరకెక్నుకించిన హమాన్ సినిమాపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. హనుమాన్ కథ విభిన్నంగా ఉంటుంది అని తెలియజేశాడు.. ఇది అందరూ అనుకుంటున్నట్లు పౌరాణిక చిత్రం కాదు. ఒక సైంటిఫిక్ మూవీ అని అన్నాడు. మనలో చాలా మంది హనుమంతుడిలా ఉండాలని ఎంతగానో కోరుకుంటారు. అయితే అలా కావాలనుకొన్న వారికి ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుంది అని అంటున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమంతుడి పాత్ర కోసం సంవత్సరం పనిచేశాం. అందుకే ఆ పాత్ర అత అద్భుతంగా వచ్చింది అని చెప్పాడు.
సినిమాలో పాత్రకు తగ్గట్లే సాహసాలు కూడా కనిపిస్తాయి.. అయితే ఒక సినిమా ప్రభావం మరోసినిమాపై ఉంటుందని ఎప్పుడూ అనుకోను..సాధ్యమైనంత వరకు వారి వారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.. కాపీ కొట్టి సినిమా తీయాలని ఎవరూ అనుకోరు కదా. ఏ సినిమా గొప్పదనం ఆ సినిమాదే ఉంటుంది. ఆదిపురుష్ వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ చాలా బాగా ఉన్నాయి. హనుమాన్ సినిమా కోసం కూడా కొత్తగా ట్రై చేస్తున్నాయి. అయితే కథలో అవసరం ఉన్నంత వరకే వీఎఫ్ఎక్స్ ఉపయోగిస్తాం. ఇప్పటి వరకు సినిమా మొత్తంలో 1600 వీఎఫ్ఎక్స్ షాట్లను చేర్చినట్టు ఆయన తెలియజేశాడు. ఇప్పటి వరకు 800 షాట్ల వర్క్ పూర్తయింది. కేవలం వీఎఫ్ఎక్స్ కోసమే రూ.10 కోట్లు ఖర్చ చేశాం అని తెలియజేశారు… ముందుగా అనుకున్న దానికంటే ప్లాన్ చేంజ్ కావడంతో బడ్జెట్ పెరిగింది అంటూ ప్రశాంత్ వర్మ పలు విషయాలు తెలియజేసి సినిమాపై అంచనాలు పెంచాడు.
read more news :
NTR : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి దూరమైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..అసలు కారణం ఇదా?