నటి హన్సిక మోత్వాని (Hansika Motwani) వ్యాపారవేత్త సోహైల్ కతురియాను డిసెంబర్ 4 న ఆదివారం రాత్రి వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముందోట కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గత వారం నుంచి హన్సిక పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం సూఫీ నైట్ వేడుక జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా వధూవరులు పలు పాటలకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.