Telugu Flash News

Hansika: జైపూర్‌లో హ‌న్సిక వివాహం.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

Hansika Motwani to marry in December, Jaipur fort booked

Hansika Motwani to marry in December, Jaipur fort booked

Hansika: అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్న విష‌యం తెలిసిందే. మెచ్చిన వాడిని పెళ్లి చేసుకోవ‌డం, కొద్ది రోజుల‌కే పిల్ల‌ల్ని క‌న‌డం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దేశ ముదురు బ్యూటీ హ‌న్సిక కూడా పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు ఏ విషయాన్ని బయటకు లీక్ కాకుండా జాగ్రత్తగా గుట్టు చప్పుడు కాకుండా పనులు చేసుకుంటుంది హ‌న్సిక‌. ఈ అమ్మ‌డు రీసెంట్గా జైపూర్ లోని ముండోటా ప్యాలెస్ వేదికను ఆమె బుక్ చేసుకోవడం ..ఆ వివరాలు సోషల్ మీడియాలో లీక్ కావ‌డంతో హ‌న్సిక పెళ్లి విష‌యం తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది.

అట్ట‌హాసంగా Hansika పెళ్లి

డిసెంబర్ 4వ తేదీ హన్సిక మోత్వాని తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. జైపూర్ లోని ముండోటా ప్యాలస్ వేదికగా హన్సిక వివాహం ఘనంగా జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.

తన పెళ్లి కోసం హన్సిక రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికీ ఫిక్స్ అయింద‌ని త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు. ఇక ఈ యాపిల్ బ్యూటీ పెళ్లి కోసం నగలు చీరలు కూడా స్పెషల్ డిజైనర్స్ దగ్గర డిజైన్ చేయిస్తుందట‌.

మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని హ‌న్సిక పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Hansika will be married in the Mundota Fort and Palace, Jaipur

హన్సిక తెలుగులో దేశముదురు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ..ఆ తర్వాత కోలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్ప‌టికీ హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది.

టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల కుర్రాళ్లలో తెలియని అలజడి సృష్టించింది. టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ‌కు తమిళనాడులో ఏకంగా గుడి కట్టేశారు.

ఇవి కూడా చూడండి : 

వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..

పిల్లల్లో జ్వరానికి భయపడద్దు.. ఇలా చేయండి..

సాయంత్రం ఆరు దాటాక చేయకూడని పనులు

Exit mobile version