HomecinemaHansika: ఆ టాలీవుడ్ హీరో త‌న‌ని వేధించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హ‌న్సిక‌!

Hansika: ఆ టాలీవుడ్ హీరో త‌న‌ని వేధించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హ‌న్సిక‌!

Telugu Flash News

Hansika: దేశ ముదురు భామ హ‌న్సిక తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కులి ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులరైన హన్సిక.. దేశ ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కావ‌డంతో హ‌న్సిక‌కి చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే తెలుగులో ఎక్కువ కాలం హవా చూపించలేకపోయింది. అదే సమయంలో తమిళ్‌లో మంచి అవకాశాలు అందుకుంది.

అక్కడ సినిమాల కంటే కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో తెగ వార్త‌ల‌లో నిలిచింది.. అయితే అతనికి బ్రేకప్ చెప్పి రీసెంట్‌గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అయితే హ‌న్సికకు కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందని తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వెలువ‌డ‌గా, దీనిపై ఈ ముద్దుగుమ్మ స్పందించింది.

కెరీర్ స్టార్టింగ్‌లో ఒక టాలీవుడ్ యంగ్ హీరో హన్సికను డేట్‌కు వెళ్దామంటూ తరచూ వేధించినట్లుగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన‌ట్టు వార్తలొచ్చాయి. అంతేకాదు చివరకు అతనికి తను మంచి గుణపాఠం చెప్పినట్లుగా ప‌లు వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ కాగా, దీనిపై హన్సిక క్లారిటీ ఇచ్చింది.

బేస్‌లెస్ వార్తలు ప్రచురించే ముందు ఒక‌సారి క్రాస్ చెక్ చేసుకోవాల‌ని పబ్లికేషన్స్‌ను కోరుతున్నా. గుడ్డిగా ప్రచురించే ముందు అస‌లు వాస్తవాన్ని తెలుసుకోండి. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వ్యాఖ్యను నేను ఎప్పుడూ చేయలేదు అంటూ హ‌న్సిక ఫుల్ క్లారిటీ ఇచ్చింది. హ‌న్సిక క్లారిటీతో పుకార్లుకి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది.

ఇక హ‌న్సిక డిసెంబర్ 4న సోహెల్ ఖతురియాను వివాహం చేసుకోగా.. అప్పటి నుంచి ఆమెని ప‌లు వివాదాలు వెంటాడాయి. తన బెస్ట్ ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లి చేసుకున్నందున విప‌రీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈ రూమర్స్‌పై ఆమె భర్త్ సోహెల్ స్పందిస్తూ.. హన్సిక వల్లే తనకు ఇంతకుముందు బ్రేకప్ అయిందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారం అంటూ చెప్పుకొచ్చాడు.కాగా, హ‌న్సిక‌ తెలుగులో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి ఆగ్ర హీరోలతో న‌టించింది. అల్లు అర్జున్‌తో ‘దేశముదురు’ తరువాత ,ఎన్టీఆర్‌తో ‘కంత్రి’లో మాత్రమే చేసింది.

తమిళంలో హ‌న్సిక‌కు ప్రత్యేకమైన అభిమాణగణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో మ‌న‌కు అర్ధం అవుతుంది. సినిమాల విషయానికొస్తే.. హన్సిక తన 51వ చిత్రాన్ని రీసెంట్‌గా ప్రకటించింది. ‘ది మ్యాన్’ పేరుతో తెరకక్కిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. మద్రాస్ స్టూడియోస్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు.

-Advertisement-

read more news :

Faima-Praveen : ఫైమా ని కాకుండా ప్ర‌వీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ?

Whatsapp: వాట్సప్‌లో నయా ఆప్షన్‌.. 15 నిమిషాల్లోపు ఎడిట్‌ చేసుకోవచ్చు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News