HomecinemaHamsa Nandini: క్యాన్స‌ర్‌ని జ‌యించిన హంస నందిని.. రియ‌ల్ ఫైట‌ర్ అంటూ కామెంట్స్

Hamsa Nandini: క్యాన్స‌ర్‌ని జ‌యించిన హంస నందిని.. రియ‌ల్ ఫైట‌ర్ అంటూ కామెంట్స్

Telugu Flash News

Hamsa Nandini: ఇటీవ‌లి కాలంలో సినీ సెల‌బ్రిటీలు క్యాన్స‌ర్ బారిన ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ స‌మ‌యంలో వారు ఆందోళ‌న‌కి గురి కాకుండా మంచి ట్రీట్‌మెంట్ తీసుకొని క్యాన్సర్‌ని జ‌యిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో హంస నందిని కూడా చేరింది. టాలీవుడ్ లో హంస నందిని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఆమెకు స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారీన పడ్డ ఆమె ఓ సారి గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో ఉన్న‌ట్టు కనిపిస్తోంది. మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో రాగా, ఈ విషయాన్ని తెలియాజేస్తూ హంసా నందిని ఒక వీడియో విడుద‌ల చేసింది. ఏడాది క్రితం జుట్టు లేకుండా.. ఏడాది తర్వాత జుట్టుతో ఎలా ఉన్నానో తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేసింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన లేటెస్ట్ గ్లామర్ లుక్ ని బయట పెట్ట‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మీరు రియల్ ఫైటర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)

also read : 

Chandini Chowdary latest photos, images, stills 2023

Shriya saran hot and stylish at Dadasaheb Phalke Awards

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News