Health Tips : ఎలాంటి అనారోగ్యం లేకుండా వందేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకోని వారు ఉండరు. తీరికలేని జీవితం, ఒత్తిళ్లు యాభై ఏళ్లు నిండకుండానే రోగాలను, నీరసాన్ని కలిగిస్తున్నాయి. యాభై ఏళ్ల నుంచి ఐదు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే దీర్ఘకాలం పాటు ఎలాంటి వ్యాధులకు అయిన దూరంగా ఉండొచ్చని, ఆయురారోగ్యాలు పొందవచ్చని హార్వర్డ్ అధ్యయనంలో వెల్లడైంది.
తాజా అధ్యయనం ప్రకారం, మీరు మధ్యవయస్సులో ఈ ఐదు అలవాట్లను పాటిస్తే, మీరు చాలా సంవత్సరాల పాటు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలను నివారించవచ్చు. ఈ ఐదు ఆరోగ్యకరమైన అలవాట్లతో మనిషి జీవితకాలం పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యకరమైన అలవాట్లేంటో చూద్దాం..
1. గుండె జబ్బులు, ఊబకాయం, కొవ్వు పేరుకుపోవడం వంటి వ్యాధులకు దారితీసే పరిస్థితులను ఆరోగ్యకరమైన ఆహారంతో నియంత్రించవచ్చు. సమతుల్య ఆహారాన్ని మితంగా మరియు శుభ్రంగా తీసుకోవాలి. ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
2. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం అవసరం. దీనితో పాటు, రోజంతా ఉల్లాసంగా మరియు ఆనందంగా గడపడానికి వ్యాయామం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వ్యాయామంతో బరువు తగ్గడం , అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. అధిక బరువు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి అనేక వ్యాధులకు దారి తీస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. BMI 18.5 నుండి 25కి మించకూడదు.
4. ఆల్కహాల్ మితంగా తీసుకోకపోతే, శరీరం వ్యాధుల బారిన పడుతుంది. రోజుకు ఒక గ్లాసుకు మించి తాగితే శరీరాన్ని రోగాలకు దగ్గర చేస్తాం.
5. ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ధూమపానంతో క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అమెరికన్ సీడీసీ హెచ్చరిస్తోంది. ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని వార్తలు చదవండి :
Healthy Aging: 16 Key Strategies for a Vibrant Life After 60