Telugu Flash News

H3N2 Virus : ఏడు రోజులైనా జ్వరం, దగ్గు తగ్గడం లేదా? ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక!

Influenza virus

H3N2 Virus influenza News : ప్రస్తుతం దేశంలో జ్వరం, తీవ్రమైన దగ్గు లక్షణాలతో చాలా మంది సఫర్‌ అవుతున్నారని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. జ్వరం, దగ్గు లక్షణాలు వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటాయని తేల్చింది. ఇన్‌ఫ్లుఎంజా A H3N2, ఇన్‌ఫ్లుఎంజా సబ్‌టైప్‌ ఈ సమస్యకు కారణమని ఆరోగ్య రంగ నిపుణులు నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా ఫ్లూతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు మూడు నెలలుగా ఈ వైరస్‌ ఇండియాలో వ్యాప్తి చెందుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వైరస్‌ (H3N2 Virus) లక్షణాలు ఎలా ఉంటాయి?

జ్వరం సాధారణంగా ఉంటుంది. దగ్గు కనిపిస్తుంది. పలువురు రోగులకు దీర్ఘకాలం పాటు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. బాధితుడు కోలుకున్న తర్వాత కూడా ఈ తరహా సిమ్‌టమ్స్ అంత తొందరగా తగ్గవు. అయితే, ఈ పరిస్థితి కారణంగా ప్రాణాపాయం ఏమీ ఉండదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కొందరు బాధితులు శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని లక్షణాలు కరోనాను పోలి ఉంటాయని చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. సబ్బు నీటితో క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదు. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో జనం మధ్యలోకి వెళ్లాల్సి వస్తే మాస్క్‌ విధిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. చేతులతో ముక్కు, నోటిని తరచూ టచ్‌ చేయకుండా ఉండాలని తెలిపారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు నోటిని పూర్తిగా కవర్‌ చేసుకోవాలి. వేసవి వచ్చేసింది కాబట్టి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. జ్వరం లేదా ఒంటి నొప్పులు ఉన్నట్లు అనిపిస్తే పారా సిటమాల్ వేసుకోవాలి.

ఇతరులతో కరచాలనం చేయడం మానుకోవాలి. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఉమ్మివేయడం మంచిది కాదు. సొంత వైద్యం చేసుకోరాదు. యాంటీ బయాటిక్స్, ఇతర మందులు వాడే ముందు వైద్యులను కాంటాక్ట్‌ అవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ రాకుండా జాగ్రత్త పడొచ్చని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్‌ ఐదేళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు త్వరగా సోకుతుందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బుల ప్రభావం ఉన్న వారు, దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

also read :

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో కీలక పరిణామం.. జైలుకు ప్రియురాలు నిహారిక!

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

Shubman Gill : ర‌ష్మిక‌పై క్రష్ ఉందన్న యువ క్రికెట‌ర్

Health Tips in telugu : ఈ 10 ఆరోగ్య చిట్కాలు మీ కోసం (07-03-2023)

Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి

Eiffel Tower : ఈఫిల్‌ టవర్‌ చరిత్ర , విశేషాలు తెలుసుకోండి

 

Exit mobile version