Telugu Flash News

Green peas in winter: చలికాలంలో బఠానీ తింటే అనారోగ్య సమస్యలు దూరం.. ఉపయోగాలివే!

green peas

పచ్చి బఠానీ (Green peas) లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల గుండె, మూత్ర పిండాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించే శక్తి పచ్చి బఠానీలకు ఉంది. రెగ్యులర్‌గా పచ్చి బఠానీలను ఉడికించి లేదా నీటిలో నానబెట్టుకొని చాలా మంది తింటూ ఉంటారు. అలాగే మ్యాగీ, వెజ్‌ బిర్యాని లాంటి వాటిలో విరివిగా వాడుతూ ఉంటారు.

పచ్చి బఠానీల వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బఠానీల్లో ఉండే ఐరన్‌, జింక్‌, మాంగనీసు, రాగి శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ముఖ్యంగా శీతాకాలం నేపథ్యంలో మన బాడీకి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బఠానీలతో పాటు శనగలు కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. రోజువారీ తీసుకొనే ఆహారంలో వీటిని చేర్చడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

బఠానీల్లో విటమిన్‌ ఏ, ఈ ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా కాపాడతాయి. చర్మం పొడిబారకుండా, ముడతలు పడటం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పెదవులు పగుళ్లు రాకుండా ఉంటాయి. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధ వ్యాధులు, గుండె సంబంధ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. బఠానీల్లో ఉండే పీచు పదార్థం కారణంగా పొట్టను క్లీన్‌ చేసేందుకు సులభమవుతుంది.

ఫైబర్‌, ఖనిజాలు, విటమిన్లకు ఢోకా లేదు..

పచ్చి బఠానీలు చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. బఠానీల్లోని ఫైబర్‌ మన జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తుంది. పచ్చి బఠానీలు ఆరోగ్యంతో పాటు అందంపై కూడా ప్రభావం చూపుతాయి. పచ్చి బఠానీలను మెత్తగా పేస్ట్‌లా చేసుకొని ముఖంపై పూసుకోవడం వల్ల సహజ సిద్ధమైన ఫేషియల్‌గా పని చేసి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. అల్జీమర్స్ తో బాధపడుతున్న వారు పచ్చి బఠానీలు వాడితే మంచి ఫలితాలు చూడొచ్చు.

also read news: 

ఏపీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్‌ రాసలీలలు.. వీడియో నెట్టింట వైరల్‌!

Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచై గురించి ఈ విష‌యాలు తెలుసుకోండి..

 

Exit mobile version