Telugu Flash News

Green foods: శరీరంలో కొవ్వును కరిగించేందుకు ఈ గ్రీన్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి.. వేగంగా ఫలితాలు!

green foods

Green foods: ప్రస్తుత జీవన శైలి కారణంగా అధిక బరువుతో చాలా మంది బాధపడుతుంటారు. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ కోల్పోవడం, రుచికరమైన ఫుడ్‌ వీక్‌నెస్‌గా భావించడం వల్ల చాలా మంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటారు. దీనికితోడు వ్యాయామం చేయకపోవడం, అధికంగా నిద్రపోవడం కూడా అధిక బరువు, కొవ్వు పేరుకుపోవడానికి కారణాలుగా ఉంటాయి. అయితే, శరీరంలో కొవ్వును కరిగించేందుకు ఆహారంలో నియంత్రణతో పాటు కొన్ని టిప్స్‌ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మన వంటకాల్లో అధికంగా సుంగంధాలను వినియోగిస్తూ ఉంటారు. దీని వల్ల రుచి పెరుగుతుంది. దాంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సుగంధాలు ఉపయోగపడతాయి. శరీరంలోని కొవ్వు కరగాలంటే నూనె శాతాన్ని గణనీయంగా తగ్గించాలి. వీలైతే నూనెతో చేసిన వంటకాల్ని అవాయిడ్‌ చేయాలి. రక్తంలో చక్కెర నియంత్రణ, ఊబకాయం తగ్గించుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కరించేయవచ్చు.

గ్రీన్‌ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించడానికి వీలవుతుంది. వీటిలో పెసలు తీసుకోవడం ద్వారా విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ లభిస్తాయి. పెసలు తీసుకుంటే ఐరన్‌, పొటాషియం దొరుకుతాయి. మరోవైపు పచ్చి బచ్చలికూరలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు, ప్రొటీన్లు పెసలులో ఉండటం వల్ల కొవ్వును కరిగించడం సులభతరం అవుతుంది.

కరివేపాకుతో కొవ్వును కరిగించేయండి..

పచ్చి మిర్చిని పరిమిత స్థాయిలో తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిస్‌ శరీరంలో జీవక్రియ సక్రమంగా జరిగేందుకు దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో సైతం ఇది రుజువైందని నిపుణులు సూచిస్తున్నారు. వీటితోపాటు ఏలకులు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఏలకుల్లో జీర్ణక్రియను సెట్‌ చేసే గుణగణాలు ఉంటాయి. దాంతోపాటు శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఏలకులు ఉపయోగపడతాయి. రోజూ కూరల్లో వినియోగించే కరివేపాకుతో కూడా శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. రోజూ తీసుకొనే టిఫిన్లలో కరివేపాకును భాగం చేసుకోవాలి. ఇక రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్‌ను కరింగించుకోవచ్చు.

Exit mobile version