Telugu Flash News

H-1B Visa : ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులకు గ్రేస్‌ పీరియడ్‌ పెంచనున్న యూఎస్!

h1b visa

H-1B Visa Latest news : ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. గతేడాది నుంచి ఇది మరింత పెరిగిపోయింది. లేఆఫ్‌ల సీజన్‌ నడుస్తుండడంతో ఉద్యోగులకు కష్టకాలంగా మారింది. వేలాది మంది సెటిలర్లు కూడా ఇంటి బాట పట్టక తప్పడం లేదు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, అమెజాన్, ట్విట్టర్‌, డిస్నీ సహా అన్ని కంపెనీలదీ ఇదే బాట. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న భారతీయులు గుబులు పడుతున్నారు. కొలువులో భరోసా కోసం తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జాబ్స్‌ కోల్పోయిన వారికి కాస్త ఊరట కలిగించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెచ్‌1బీ వీసాతో అమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, జాబ్‌ ఊడిపోయాక రెండు నెలల్లోగా మరో కంపెనీని వెతుక్కొని చేరిపోవాలి. లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అమెరికా చట్టాలు ఇదే చెబుతున్నాయి. అయితే, తాజా పరిస్థితుల దృష్ట్యా అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుందట. ఈ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రెసిడెన్షియల్‌ అడ్వైజరీ సబ్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

వేలాది మంది హెచ్‌1బీ వీసావర్కర్లకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 180 రోజుల గడువు వల్ల జాబ్‌ పోయిన వారు మరో కంపెనీని వెతుక్కొనేందుకు సులభతరం అవుతుంది. మరో ఉద్యోగం చూసుకోవాలంటే ఆ మాత్రం సమయం ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. హెచ్‌1బీ వీసీ అనేది ఇమిగ్రెంట్‌ వీసా. అమెరికా సంస్థలు విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి పని చేయించుకొనేందుకు ఈ వీసాలు ఉపయోగపడతాయి. ఇక 60 రోజుల గడువు వల్ల ప్రస్తుతం చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో 180 రోజులకు పెంచడం ద్వారా చాలా మందికి ఊరట కలుగుతుందని సబ్‌ కమిటీ పేర్కొంది.

హెచ్‌1బీ వీసాపై వచ్చిన నిపుణులను కోల్పోవడానికి బదులుగా మినహాయింపులు ఇవ్వడం మంచిదని అమెరికా ఆలోచిస్తోందట. ఈ మేరకు బైడెన్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికాలో చదువుకోవాలని కలలు కనే స్టూడెంట్లకు ఆ దేశం తాజాగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కోర్సు ప్రారంభమయ్యే ఏడాది ముందే వీసా తీసుకొనేందుకు యూఎస్ సర్కార్‌ అవకాశం కల్పించింది. ఇప్పటికే వీసాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది ఊరట ఇవ్వనుంది.

also read :

Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023

Kousalya: రెండో పెళ్లిపై ఒత్తిడి ఎక్కువ అయింద‌న్న సింగ‌ర్.. భ‌ర్తతో ఎదురైన ఇబ్బందుల‌పై తొలిసారి ఓపెన్

Exit mobile version