Gold Silver Prices today : బంగారం ధరలు కాస్త తగ్గినట్టే తగ్గి పైపైకి వెళుతున్నాయి.బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో మహిళలు కాస్త అసంతృప్తితో ఉంటున్నారు. సెప్టెంబర్ 18న ఆదివారం దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
10 గ్రాముల ధరపై రూ. 150 నుంచి రూ.170 వరకు పెరగగా, కిలో వెండిపై రూ.300 వరకు పెరిగింది. బంగారం, వెండి ధరలు ఒకేసారి పెరగడం మహిళలకు కాస్త షాకిచ్చే విషయం అనే చెప్పాలి. దేశంలోని పలు నగరాలలో వెండి, బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయి అనే దానిపై ఓ లుక్కేస్తే..
భగభగమంటున్న బంగారం..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,1300కి చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఆగింది.
ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద కొనసాగుతుండడం మనం గమనించవచ్చు.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180గా ఉంది .
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000, విజయవాడలో రూ.62,000, విశాఖపట్నంలో రూ.62,000 లుగా కొనసాగుతుంది.
మరిన్ని వార్తలు చదవండి :
Krishnam Raju: ఇది నిజమా.. ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో రాశాడా..!