HomebusinessGold Rates: మ‌గువ‌ల‌కు షాకిచ్చే న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర ఎలా ఉంది అంటే..!

Gold Rates: మ‌గువ‌ల‌కు షాకిచ్చే న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర ఎలా ఉంది అంటే..!

Telugu Flash News

Gold Rates: ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఓ సారి పెర‌గడం, మ‌ళ్లీ త‌గ్గడం వంటివి బంగారం విష‌యంలో జ‌రుగుతుంది.శ‌నివారం రోజు బంగారం భ‌గ‌భ‌గ మంది. మ‌గువుల‌కి ఈన్యూస్ షాకింగ్‌గా మారింది.

10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 పెరిగి.. రూ. 46,500కి చేరుకోగా, శుక్రవారం ఈ ధర రూ. 46,000గా మాత్ర‌మే ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 5000 పెరిగి, రూ. 46,500కి చేరింది . దేశీయంగా కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గి రూ.56,800 లుగా కొన‌సాగుతుంది.

ప‌సిడి పైపైకి..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890 ఉండ‌గా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 లుగా కొన‌సాగుతుంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 కొన‌సాగుతుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,730 గా నిలిచింది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 గా ఉండ‌గా, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 గా కొన‌సాగుతుంది.

-Advertisement-

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730గా ఉంది. మ‌రోవైపు విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 నిలిచింది.

ఇక హైదరాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంల‌ల‌లో కిలో వెండి ధర రూ.62,500గా కొన‌సాగుతుంది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News