Gold Rates Today: నేడు బంగారం ధర భారీగా తగ్గింది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి మరో దఫా రుణ రేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో డాలర్ బలపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధర పతనమైంది.
ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) గోల్డ్ ధర 1,986 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.450, స్వచ్ఛమైన పసిడి ధర రూ.490 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.500 తగ్గింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,420 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,200 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,300గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,420 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,200 గా ఉంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,700 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,850గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.30 పెరిగి రూ. 28,170 వద్దకు చేరింది.