Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (16-05-2023)

gold and silver rates today

gold and silver rates today

Gold Rates Today: ఈరోజు బంగారం ధరల్లో మార్పులు లేవు. ఐదు వారాల గరిష్ట స్థాయి నుంచి అమెరికన్‌ డాలర్‌ బలహీనపడింది. దీంతో అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో కాస్త ఉత్సాహం కనిపించింది.

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,024 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన దేశంలో, ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో మార్పులు కనిపించలేదు. వెండి రేటులోనూ ఎలాంటి మార్పు లే.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,800 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,650గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,800 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,500 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,150 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,350గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.140 పెరిగి రూ. 27,830 వద్ద కొనసాగుతోంది.

Read Also : Weather Today (16-05-2023): మాడు పగిలేలా ఎండలు.. నేటి వాతావరణం ఇలా..

Exit mobile version