Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (15-05-2023)

gold and silver

Gold Rates Today: ఈరోజు బంగారం ధరల్లో మార్పులు లేవు. అమెరికన్‌ డాలర్‌ నెల గరిష్ట స్థాయికి బలపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వారం కనిష్ట స్థాయికి దిగింది.

ప్రస్తుతం ఔన్స్‌ (28.35 గ్రాములు) 2,016 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియాలో ఇవాళ ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి ధరల్లోనూ మార్పు కనిపించలేదు.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,800 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,650గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,800 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,500 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,150 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,350గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధరలో కూడా ఇవాళ మార్పులు కనిపించలేదు. 10 గ్రాములు రూ. 27,690 వద్ద కొనసాగుతోంది.

Read Also : horoscope today telugu : 15-05-2023 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version