Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (13-05-2023)

gold and silver rates today

gold and silver rates today

Gold Rates Today: బంగారం ధర ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. నేడు మనదేశంలో బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. అమెరికాలో రుణ పరిమితి, బ్యాంకింగ్‌ రంగంలో ఆందోళనలతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది.

ప్రస్తుతం ఔన్స్‌ (28.35 గ్రాములు) 2,015 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియాలో నేడు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం రూ.400, స్వచ్ఛమైన పసిడి రూ. 440 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,600 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,550 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,690 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,700 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,550గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,690 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,700 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,050 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,240గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.660 తగ్గింది. రూ. 28,590 వద్దకు చేరింది.

Read Also : Weather Today 13-05-2023): తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వాతావరణం ఇలా..

Exit mobile version