Gold Rates Today : బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ కూడా పసిడి పైపైకి ఎగబాకింది. ఈరోజు 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.100, స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 చొప్పున పెరిగింది. కిలో వెండి రూ.400 పెరిగింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,850గా నమోదైంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930గా ఉంది. వెండి కిలో రూ.80,400గా నమోదైంది.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930గా ఉంది. బంగారం ధరలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే ధర అమల్లో ఉంటాయి.
చెన్నై నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,330 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,440 కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.56,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,080 గా నమోదైంది.
పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,930 గా ఉంది. విలువైన లోహం ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.150 తగ్గింది. రూ.28,220 కి చేరింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే ధర అమల్లో ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE