Gold Rates Today : అంతకంతకూ పెరిగిపోతున్న పసిడి ఈరోజు కాస్త బెట్టు తగ్గించింది. ఒక మెట్టు దిగి రేటు కాస్త తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గి బంగారం కొనే వారికి కాస్త ఊరట ఇచ్చింది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.60,820గా ఉంది. కిలో వెండి ధర రూ.80,000గా ఉంది.
ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ రేట్లే అమలులో ఉంటాయి. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర రూ.60,820గా నమోదైంది.
విజయవాడలో కిలో వెండి ధర రూ.80 వేలుగా ఉంది. విశాఖతో పాటు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,970గా ఉంది.
బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,800 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,870గా ఉంది. విలువైన లోహం ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.360 తగ్గింది. 28,370 రూపాయలు పలుకుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే ధర అమలవుతుంది.
also read :
Weather Today (29-04-2023) : తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..