Gold Rates Today : పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. సగటు జీవి కాస్త బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థతులు ఏర్పడ్డాయి. తులం బంగారం ధర 62 వేల రూపాయల దిశగా అడుగులు వేగంగా వేస్తోంది.
అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపకపోయినా పసిడి ధర మాత్రం ఆగడం లేదు. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 చొప్పున పెరిగాయి. మరోవైపు కిలో వెండి ధర రూ.200 తగ్గింది.
హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం అయితే రూ.61,040గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.80,200గా నమోదైంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,040గా ఉంది. ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర నేడు రూ.56,420గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,550కి చేరుకుంది.
దేశంలో వాణిజ్యానికి ప్రధాన కేంద్రమైన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040 కి చేరింది. సంపన్నులు అధికంగా ఇష్టపడే ప్లాటినం రేటు ఇవాళ కాస్త పెరిగింది. రూ.270 పుంజుకొని 10 గ్రాములు రూ.28,870కి చేరుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ధర ఒకే రకంగా ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE