Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (21-05-2023)

gold and silver

Gold Rates Today: ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కామెంట్స్‌, అమెరికా బ్యాంకింగ్‌ రంగంలో ఆందోళనలు చల్లారడంతో బంగారం ధర పుంజుకుంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,979 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.500 , స్వచ్ఛమైన పసిడి ధర రూ.550 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.1,000 జంప్‌ చేయడం గమనార్హం.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,420 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,300గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,420 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 79,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.58,800 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,960గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.90 తగ్గింది. రూ. 28,360 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

Exit mobile version