Gold Rates Today: బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ కూడా ధరల్లో పెరుగుదల నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం 2,037 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇండియాలో ఇవాళ 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.250, స్వచ్ఛమైన పసిడి రేటు రూ.280 చొప్పున పెరుగుదల నమోదు చేశాయి. కిలో వెండి ధర మాత్రం రూ. 100 తగ్గడం గమనార్హం.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,950 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.62,130 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,700 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,950గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.62,130 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 82,700 గా ఉంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,370 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,590గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర భారీగా పెరిగింది. 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ. 29,260 వద్దకు చేరింది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE
Read Also : Weather Today (11-05-2023): నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా..