Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (19-05-2023)

gold and silver rates today

gold and silver rates today

Gold Rates Today: బంగారం ధర ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. అమెరికా రుణ పరిమితిని పెంచే ఒప్పందం కుదిరే చాన్స్‌ ఉందనే సంకేతాల నేపథ్యంలో గోల్డ్‌ ధరల్లో మార్పు చోటు చేసుకుంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) పసిడి ధర 1,957 డాలర్ల వద్ద నమోదైంది. భారత్‌లో 10 గ్రాముల ఆర్నమెంట్‌ గోల్డ్ ధర రూ.200, స్వచ్ఛమైన పసిడి ధర రూ.220 చొప్పున దిగి వచ్చాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,100 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,200 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,100 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,100గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,200 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,100 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,500 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,640గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.130 పెరిగింది. రూ. 28,300 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 19-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version