Gold Rates Today: బంగారం ధర ఇవాళ కాస్త పెరిగింది. అమెరికా రుణ పరిమితి పెంపు చర్చల్లో ప్రతిష్టంభన, యూఎస్ ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో గోల్డ్ రేటులో మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,97.30 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.250, స్వచ్ఛమైన పసిడి ధర రూ.260 చొప్పున పుంజుకుంది. కిలో వెండి ధర మాత్రం రూ.450 తగ్గింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,250 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,360 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,250గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,360 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 77,500 గా ఉంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,650 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,800గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.490 తగ్గింది. రూ. 27,960 వద్దకు చేరింది.
Read Also : Today Horoscope : 25-05-2023 ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది..