Gold Rates Today : ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు అమెరికా జాబ్ డేటా బలంగా నమోదైంది. బాండ్ ఈల్డ్స్ కూడా దృఢపడటంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు కొద్దిగా తగ్గాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర ప్రస్తుతం 2,025 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇండియాలో నేడు 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి ధర రూ.10, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 చొప్పున మాత్రమే తగ్గాయి. ఇక వెండి ధరలో మార్పు కనిపించలేదు.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,490 కి చేరింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.61,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.82,400 గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఏపీలోని విజయవాడ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,490 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రేటు రూ.61,630 గా నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.82,400 గా పలుకుతోంది.
చెన్నైలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,910 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,080 కి చేరింది. విలువైన లోహం ప్లాటినం ధరలో కూడా మార్పు లేదు. 10 గ్రాముల రేటు రూ.27,850 గా ఉంది.
Read Also : Horoscope (08-05-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?