Gold Rates Today : ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం (28.35 గ్రాములు) ధర 2 వేల డాలర్లపై కదలాడుతోంది. ఈ నేపథ్యంలో మనదేశంలోని గోల్డ్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది.
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.800, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.880 పెరిగాయి. అదే సమయంలో కిలో వెండి రేటు రూ.700 పెరిగింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640కి ఎగబాకింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81,800గా నమోదైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి. ఏపీలోని విజయవాడ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.56,500గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ గోల్డ్ రేటు రూ.61,400గా నమోదైంది.
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ.57,060 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,240 కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 కి చేరింది.
ప్లాటినం ధరలోనూ మార్పులు జరిగాయి. 10 గ్రాములకు రూ.350 పెరిగింది. రూ.27,930కి చేరుకుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE