HomebusinessGold Rates Today (02-05-2023) : నేడు బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Rates Today (02-05-2023) : నేడు బంగారం, వెండి ధరలు ఇలా..

Telugu Flash News

Gold Rates Today : ఇవాళ దేశ వ్యాప్తంగా బంగారం ధర కాస్త తగ్గింది. బిస్కెట్‌ బంగారం ధర ఇప్పటికే 61 వేల రూపాయలకు చేరువలో ఉంది. నేడు 10 గ్రాముల ఆర్నమెంటు గోల్డ్‌ రేటు రూ.150, స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 చొప్పున తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.200 తగ్గింది.

హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 వద్ద నమోదైంది.  హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.60,760 వద్ద కదులుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.80,200గా ఉంది.

బంగారం ధరలు తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సేమ్‌ రేటు ఉంటాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760గా ఉంది. కిలో వెండి ధర రూ.80,200గా ఉంది.

చెన్నై నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.56,300గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,420కి చేరుకుంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,810గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,850గా ఉంది. అదే స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ.60,910గా ఉంది. విలువైన ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గింది. రూ.28,110కి చేరింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్లాటినం ధర ఇదే అమల్లో ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News