Gold Rates Today : బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతోంది. పెళ్లిళ్లు, శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో కొనుగోలు దారుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లో బిస్కెట్ బంగారం ధర రూ.61,000కు సమీపించింది.
నేడు ఆర్నమెంట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేటుదీ అదే పరిస్థితి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.60,930 గా ఉంది.
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.80,400 గా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంటుంది. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు రూ.55,850 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ గోల్డ్ రేటు రూ.60,930 గా నమోదైంది.
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,400 గా ఉంది. విశాఖపట్నంతోపాటు స్టేట్ వైడ్ ఇవే ధరలుంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.56,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,080 గా నమోదైంది.
మైసూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,980 గా ఉంది. ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 28,220గానే ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీని ధర ఒకటే ఉంటుంది.
also read :
Vanitha Vijay Kumar: విషాదం.. వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
Agent : వింత వాదన.. లైగర్, ఏజెంట్ చిత్రాలు ఫ్లాప్ కావడానికి కారణాలు ఇవేనట…!