Gold Rates Today: బంగారం ధర నేడు కాస్త పెరిగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందన్న అంచనాలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం (28.35 గ్రాములు) ధర స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది.
ప్రస్తుతం 2,036 డాలర్ల వద్ద ఔన్స్ గోల్డ్ ధర కొనసాగుతోంది. ఇండియాలో నేడు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.100, స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 చొప్పున పెరిగాయి. వెండి రేటులో మార్పు లేదు.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.56,700 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,850 గా ఉంది. కిలో వెండి ధర రూ. 82,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉంటాయి.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,700 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,850 గా నమోదైంది. వెండి ధర రూ.82,500 గా ఉంది.
ఇక చెన్నై నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,400గా ఉంది. విలువైన లోహం ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 270 పెరిగి రూ.28,170 వద్ద కొనసాగుతోంది.
Read Also : Weather Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఇలా.. (10-05-2023)