Gold Rates Today : బంగారం విలువ తగ్గడం లేదు. యూఎస్ డాలర్ విలువ కాస్త పతనం అయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర పుంజుకుంది.
ప్రస్తుతం 2,032 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ రేటు రూ.110, స్వచ్ఛమైన పసిడి ధర రూ.120 పెరిగింది. కిలో వెండి రేటు రూ.400 పెరిగింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,600 కి చేరింది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే రూ.61,750 గా ఉంది. కిలో వెండి ధర రూ.82,700 గా ఉంది.
తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు గోల్డ్ రేటు రూ.56,600 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.61,750 గా నమోదైంది. కిలో వెండి ధర రూ.82,400 గానే నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ.57,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,290 కి చేరింది. ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.50 పెరిగి రూ. 27,900 వద్ద స్థిరపడింది.
Read Also : Weather Today: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వాతావరణం ఇలా.. (09-05-2023)