Gold Rates Today : అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెద్దగా మారలేదు. మనదేశంలో కూడా రేట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్న తరుణంలో బంగారం ధరల్లో మార్పు జరగలేదు.
నేడు ఆర్నమెంట్ బంగారం, స్వచ్ఛమైన పసిడి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. వెండి రేటు మాత్రం రూ.100 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,700గా ఉంది.
అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.60,760 వద్ద నమోదైంది. కిలో వెండి ధర రూ. 80,500 గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,700గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,760 గా నమోదైంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర నేడు రూ.56,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,250 కి చేరింది.
పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,760 గా ఉంది. విలువైన ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.530 తగ్గింది. రూ.27,580కి చేరుకుంది.
also read :
Weather Today (03-05-2023) : తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..