Telugu Flash News

Gold Rates : భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియుల హుషారు!

gold rates today

ఇటీవల బంగారం ధరలకు(Gold Rates)  రెక్కలొచ్చాయి. వరుసగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అయితే, రెండు రోజుల నుంచి గోల్డ్‌ ధర తగ్గుముఖం పట్టింది. కొంతకాలంగా దూకుడుమీదున్న బంగారం ధర.. ప్రస్తుతం కాస్త తగ్గింది. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెరుగుదల ప్రభావంతో బంగారం ధరలు మరింత క్షీణత దిశగా వెళ్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాస్త రేటు తగ్గడంతో బంగారం ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మరోవైపు జాతీయ, అంతర్జాతీయంగానూ బంగారం ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిపుణులు ఒకవైపు బంగారం ధర ఇంకా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి తగ్గుదల నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.52,400గా ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ.53,000గా నమోదైంది. అంటే ఒక్క రోజులోనే రూ.700 తగ్గినట్లయింది.

మరోవైపు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా ఉంది. ఇదే బంగారం ధర నిన్న రూ.57,930గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏపీలోని విజయవాడలో రూ.52,400గా ఉంది. ఇదే ధర నిన్న రూ.53,100గా ఉండేది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.57,160గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రేటు ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా ట్రేడ్‌ అవుతోంది. ఇదే బంగారం ధర నిన్న రూ.53,250గా ఉండేది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.57,310గా నమోదైంది. ఇదే ధర నిన్న రూ.58,080గా ఉండేది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర రూ.52,400గా కొనసాగుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100గా నమోదైంది. మరోవైపు చెన్నైలో బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నై నగరంలో రూ.58,200గా నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే రూ.53,350గా నమోదైంది. చెన్నైలో కాస్త మార్పు ఎక్కువగా కనిపించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

also read news : 

ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్‌ తింటే తిరుగుండదు!

 

Exit mobile version