Gold and Silver Rates today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.71,870కి చేరుకుంది.
22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,890కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,720గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.65,740గా ఉంది. అయితే వెండి(silver) ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ధర (24 క్యారెట్లు, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 71,720
విజయవాడలో రూ. 71,720
ఢిల్లీలో రూ. 71,870
చెన్నైలో రూ. 72,270
ముంబైలో రూ. 71,720
కోల్‌కతాలో రూ. 71,720
వడోదరలో రూ. 71,770
బెంగళూరులో రూ. 71,720
కేరళలో రూ. 71,720
వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
దేశంలో నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 89,900 కాగా, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ. 94,400గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 89,900, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,400, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 89,900, కేరళలో కిలో వెండి ధర రూ. 94,400, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,400, వడోదరలో కిలో వెండి రేటు రూ. 89,900గా ఉంది.