Telugu Flash News

Gold & Silver Price Today: శాంతించిన బంగారం.. వెండి ప‌రిస్థితి ఏంటంటే..!

gold and silver prices today

Gold & Silver Price Today: ఈ మ‌ధ్య బంగారం రేట్లు క్ర‌మ‌క్ర‌మేపి త‌గ్గుతున్నాయి. ఒక‌సారి పెర‌గ‌డం మ‌ళ్లీ త‌గ్గ‌డం వంటి జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే నేడు బంగారం ధ‌ర‌తో పాటు వెండిధ‌ర కూడా త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గ‌డంతో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 కు చేరింది.

అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.49,960గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,800 గా ప‌లుకుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 200 పెరిగి …హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62,200గా కొన‌సాగుతుంది.

దిగి వ‌చ్చిన బంగారం..

ఇక విజయవాడలో రేట్లు చూస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.45,800గా ప‌లుకుతోంది. 24 క్యారెట్స్ బంగారం ధర 49,960గా ఉంది. వెండి ధర కిలో రూ. 62,200 వద్ద కొనసాగుతోంది.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ప‌లుకుతోంది .

చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా కొన‌సాగుతుంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ప‌లుకుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,110 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,850గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,040 వద్ద కొన‌సాగుతుంది.

ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,960గా కొన‌సాగుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,800 వద్ద ప‌లుకుతుంది.

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడ‌డం వ‌ల‌న బంగారంలో పెరుగుద‌ల కనిపిస్తుంది.

Exit mobile version