Telugu Flash News

Gold Silver Price Today:మ‌హిళ‌లకు గుడ్ న్యూస్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌, వెండి ప‌రిస్థితి ఏంటి?

gold and silver prices today

Gold Silver Price Today: సెప్టెంబ‌ర్ నెల‌లో బంగారం ధ‌ర‌ల హెచ్చు త‌గ్గులు చూస్తున్నాం.అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల దృష్ట్యా బంగారం ధ‌ర‌లు ఒక‌సారి పెరుగుతూ వెంట‌నే త‌గ్గుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. అయితే మంగ‌ళ‌వారం ధ‌ర‌లు కాస్త స్థిరంగా ఉండ‌గా, ఈ రోజు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. వెండిరేటు మాత్రం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.20 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 20 తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,980గా నమోదైంది.

Gold silver price: శాంతించిన బంగారం..

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,730 వద్ద కొనసాగుతుండ‌గా, వెండి ధ‌ర మాత్రం రూ. 1,800 పెరగ‌డంతో …హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62,400గా ఉంది. ఇక మిగ‌తి ఏరియాల‌లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే.. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,730గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,980గా నమోదైంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది. ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,880గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,140 వద్ద కొనసాగుతోంది. బెంగ‌ళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,780గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,980గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,730 వద్ద కొనసాగుతోంది.

Exit mobile version